Header Banner

వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరిట స్టాండ్! ఎమోషనల్ అయిన హిట్ మ్యాన్!

  Sat May 17, 2025 10:37        Sports

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ నుంచి అరుదైన గౌరవం లభించింది. వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, అర్ధాంగి రితికతో కలిసి రోహిత్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. ఈ స్టేడియంతో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

 

ఇది కూడా చదవండి: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ గుడ్ న్యూస్! ఎలాగైనా వ‌చ్చే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్..



వాంఖడే గొప్ప స్టేడియం అని, దీనితో తనకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో వన్డే ఫార్మాట్‌లో టీమిండియా తరపున వాంఖడే స్టేడియంలో ఆడాలని ఉందనే కోరికను వెలిబుచ్చారు. స్టేడియంలో ఓ స్టాండ్‌కు తన పేరు పెడతారని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ఏ ఆటగాడికైనా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని, దేశానికి సేవ చేయాలని ఉంటుందని, ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లు సాధిస్తామని అన్నారు. అయితే, వీటన్నింటికంటే ఇది ఎంతో ప్రత్యేకమని అభిప్రాయపడ్డారు.



గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నేతల మధ్యలో తన పేరు ఉండటాన్ని మాటల్లో చెప్పలేనని, ఇందుకు ముంబయి క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. కాగా, వాంఖడే స్టేడియంలో సునీల్ గ‌వాస్క‌ర్‌, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్ల పేర్లతో స్టాండ్‌లు ఉండగా, తాజాగా రోహిత్ శర్మ, శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేరిట స్టాండ్లను ఆవిష్కరించారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #RohitSharma #WankhedeStadium #RohitSharmaStand #IndianCricket #CricketLegend